కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో సందిగ్దత నెలకొంది. మార్చ్ 28 అంటూ మేకర్స్ హడావిడే కానీ.. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వీరమల్లు కోసం డేట్స్ కేటాయించని కారణంగా సినిమా విడుదల లేట్ అవుతుంది, అందులోను పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలి అందుకే సినిమా విడుదల మళ్ళీ పోస్ట్ పోన్ అంటూ మాట్లాడుకుంటున్నారు.
కానీ హరి హర వీరమల్లు నిర్మాత ఏ ఏం రత్నం గారు మాత్రం ఎవ్వరూ కంగారు పడొద్దు హరి హర వీరమల్లు ఖచ్చితంగా మార్చి 28 అనుకున్న తేదీకే వస్తుంది అంటూ ఓ ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్ గా చెప్పడం పవన్ ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇచ్చింది. రిలీజ్ కు సంబందించిన పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
ఎవరికీ ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అనుకున్న సమయానికి హరి హర వీరమల్లును విడుదల చేస్తాం. పవన్ కల్యాణ్ కు సంబంధించి మిగిలిన షూటింగ్ ను కూడా పూర్తి చేస్తున్నాం.. అని చెప్పారు. ఇక ఈ నెల 24 న హరి హర వీరమల్లు నుంచి సెకండ్ సాంగ్ వదలబోతున్నట్టుగా లవ్లీ పోస్టర్ తో వాలంటైన్స్ డే రోజున మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు.