రీసెంట్ గా కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఆంధ్ర-తెలంగాణగా విడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉంటూ అప్పుడప్పుడు యాక్టీవ్ గా ప్రెస్ మీట్లు పెట్టే ఉండవల్లి తాజాగా పవన్ కళ్యాణ్ ని పొగిడేస్తున్నారు.
గత 11 ఏళ్ల నుంచి నేను ప్రతి ఏడాది విభజన జరిగిన రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను
ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పై అశ, నమ్మకంతో విభజన గాయాన్ని గుర్తుచేస్తున్నాను.
ఆంధ్రా లో కూడా ఒక మగాడు ఉన్నాడని అని పవన్ కళ్యాణ్ నిరూపించాలి
చంద్రబాబు, జగన్ సాధించలేని విభజన నష్టాన్ని పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి సాధించాలి.
పవన్ కళ్యాణ్ పై నాకు నమ్మకం ఉంది
పవన్ కళ్యాణ్ చొరవ చూపించిశ కేంద్రం నుంచి సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేయించాలి
మరో రెండు రోజుల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో విభజన అంశం ప్రస్తావించాలి
విభజన నష్టం కారణంగా ఏపీకి 74 వేల 542 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలి.
ఏపీకి పవన్ కళ్యాణ్ ఆశాజ్యోతి గానేను భావిస్తున్నాను
రాజకీయాల నుంచి నేను కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకున్నాను.. అంటూ ఆయన పవన్ భజన మొదలు పెట్టారు.