2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల కోసం ఫైట్ చెయ్యాల్సిన జగన్ తన పార్టీలో అవినీతి లేదంటే నోటి దురుసు వలన జైలు పాలయిన నేతలను జైల్లో కలవడానికే సమయం సరిపోవడం లేదు. ఎన్నికల సమయంలో ఈవీఎం ల ధ్వంసం కేసులో జైలుకెళ్లిన పిన్నెల్లి నుంచి అవినీతి కేసులో జైలుకెళ్లిన నందిగం సురేష్ వరకు జగన్ జైలుకెళ్లి పరామర్శించి వచ్చారు.
అంతేకాదు తాజాగా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులోనూ, అందుకు సాక్ష్యం చెప్పిన వ్యక్తి ని కిడ్నప్ చేసిన కేసులో జైలుకెళ్లిన వల్లభనేని వంశీని పరామర్శించేందుకు ఈ రోజు జగన్ బెంగుళూరు నుంచి విజయవాడ జైలు కెళ్లారు. గత గురువారం వల్లభనేని వంశీ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెంగుళూరు నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన జగన్ అక్కడి నుంచి అటే జగన్ వల్లభనేని వంశీని ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించారు. జైలు వద్ద వంశీ భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు. దానితో పోలీసులు జైలు వద్ద భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వంశీ పరామర్శ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది.