సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ నుంచి స్ట్రీమింగ్ లోకి రాగా.. డాకు మహారాజ్ ఈ నెల 21 వచ్చే శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వస్తోంది. దానితో సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓటీటీ డేట్ పై అందరి చూపు పడగా... మధ్యలో మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు.
జీ 5 ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ అయ్యేకన్నా ముందే జీ తెలుగులో అంటే సంక్రాంతికి వస్తున్నాం బుల్లితెర మీద నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కు నేరుగా అందుబాటులోకి వచ్చేస్తుంది అంటూ ప్రకటించారు. అయితే గత వారం రోజులుగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం టీవీ ప్రీమియర్స్ జీ తెలుగులో కమింగ్ సూన్ అంటూ ఊరిస్తున్నారు.
అంతేకాని సంక్రాంతికి వస్తున్నాం ఈ డేట్ కి వస్తుంది అని మాత్రం చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చెయ్యడం చూసి ఇంకా ఎంతగా ఊరిస్తారు అంటూ ఆతృతగా కామెంట్ చేస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్.