బాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో విక్కీ కౌశల్-రష్మిక మందన్న ల చావా కి హిట్ టాక్ రావడమే కాదు రోజు రోజుకి ఈ చిత్ర కలెక్షన్స్ నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. విడుదలైన మూడు రోజుల్లోనే చావా చిత్రం 100 కోట్ల మార్క్ ను టచ్ చెయ్యడం పట్ల బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చావా విడుదలైనప్పటి నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడమే కాదు.. విక్కీ కౌశల్ నటన, రష్మిక పెరఫార్మెన్స్ కు, చావా మేకింగ్ కి ఆడియన్స్ ఫిదా అవడంతో చావా కలెక్షన్స్ రోజు రోజుకి పుంజుకుంటున్నాయి. యుద్ధం, యాక్షన్ సన్నివేశాలు, సెకండ్ హాఫ్ అన్ని ప్లస్ అవడంతో చావా ను ఆడియన్స్ లైక్ చేస్తున్నారు.
బలమైన కథ లేకపోవడం, ఫస్ట్ హాఫ్ లోడ్రామా పండకపోవడం మైనస్ అయినా ఎక్కువ శాతం సినిమాలో పాజిటీవ్ పాయింట్స్ ఉండడం చావా కు కలిసొచ్చింది. అందుకే మొదటి రోజు 24 కోట్లు ఓపెనింగ్స్ మాత్రమే వచ్చినా శని, ఆదివారాల్లో చావా కలెక్షన్స్ మెరుగ్గా ఉండడంతో మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది.