మంచు ఫ్యామిలీ వ్యవహారం రోజు రోజుకి సర్దుకోవాల్సింది పోయి.. ఇంకా ఇంకా ముదురుంది. మోహన్ బాబు vs మంచు మనోజ్ మధ్యన గొడవ అని బయటికి కనిపిస్తున్నా.. మంచు విష్ణు vs మంచు మనోజ్ ల నడుమ రగులుతున్న మంట ఆరటం లేదు. తాజాగా మంచు మనోజ్ మరోసారి ఈ వ్యవహారంలో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్ కు సోమవారం రాత్రి మంచు మనోజ్ వెళ్లాడు. రాత్రి 11.15 గంటల సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు స్టేషన్ ఎదుటే బైఠాయించాడు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బసచేయగా పోలీసులు తమపై నిఘా పెట్టారు. తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.
నా అనుచరులను పోలీసులు స్టేషన్ కి పిలిచారు. తాను స్టేషన్ కి వచ్చేసరికి ఎస్సై లేరని మంచు మనోజ్ విమర్శించాడు. తాను ఎక్కడికెళ్లినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ స్టేషన్ ఎదుటే మనోజ్ హంగామా చేసాడు. అనంతరం సీఐ ఇమ్రాన్బాషాతో ఫోన్లో మాట్లాడిన మనోజ్.. తాను ఎంబీయూ విద్యార్థుల కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశాడు