పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా స్పీడ్ మీదున్నారు. వరస సినిమాల లైనప్ తో ఫ్యాన్స్ కు కిక్ ఇస్తున్నారు. రాజా సాబ్-ఫౌజీ (వర్కింగ్ టైటిల్) రెండు చిత్రాల షూటింగ్స్ తో ప్రభాస్ బిజీ బిజీ. మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ షూటింగ్ ఇప్పటికే ఫినిష్ కావాల్సి ఉండగా.. మధ్యలో ఫౌజీ షూటింగ్ స్టార్ట్ చెయ్యడంతో రాజా సాబ్ షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది.
మరోపక్క హను రాఘవపూడి ప్రభాస్ డేట్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ఫౌజీ షూటింగ్ ని చక చక ఫినిష్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ జోడిగా ఇమాన్వి నటిస్తోంది. ఇప్పటికే ఇమాన్వి ఫౌజీ సెట్ లో జాయిన్ అయ్యింది. స్వాతంత్రం రాక ముందు జరిగే నేపథ్యంలో ఫౌజీ కథ ఉండబోతుంది అనే ప్రచారం ఉండగా.. ఇందులో యువరాణి పాత్ర ఒకటి కీలకంగా ఉంటుందట.
అందుకోసం బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ని హను రాఘవపూడి సంప్రదిస్తున్నారనే వార్త హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న అలియా భట్ ను ఈ పాత్ర చేసేందుకు హను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట. అయితే ప్రభాస్ పక్కన అలియా భట్ జోడిగా కనిపించకపోయినా.. ఆమె పాత్ర ఫౌజీ లో కీలకంగా ఉంటుందట. అందు కోసమే బాలీవుడ్ యువరాణిని ఫౌజీ యువరాణి పాత్ర కోసం సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.