గత ఏడాది నాకు చాలా ప్రత్యేకం అంటుంది సక్సెస్ ఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. అంతేకాదు కెరీర్ తొలినాళ్లలోనే విభిన్నమైన దర్శకులతో సినిమాలు చేసే అదృష్టం నాకు దక్కింది అంటూ ఈమధ్యన ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం తో ఈ ఏడాది తోలి బోణి కొట్టింది.
గత ఏడాది లక్కీ భాస్కర్ తో సక్సెస్ తో 100 కోట్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి ఈఏడాది ఆరంభంలోనే 300 కోట్ల హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు డిఫ్రెంట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ దర్శనిర్మాతలనే కాదు యూత్ ని పడేసేందుకు ట్రై చేస్తుంది ఈ భామ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి తనకు కెరీర్ ఆరంభంలోనే విభిన్న దర్శకులతో పని చేసే అవకాశం వచ్చింది, అంతేకాదు 2024 ఏడాది నాకు చాలా ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో విజయవంతమైన సినిమాలు చేసిన మీనాక్షి కోలీవుడ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోయింది.