ఏపీ లో సంక్రాంతి వచ్చింది అంటే కోళ్ల పందేలతో అటు డబ్బలు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇటు డబ్బు సంపాదించుకునేవాళ్ళు ఉంటారు. ఇక పందేల్లో లక్షల్లో డబ్బులు చేతులు మారుతూ ఉంటాయి. కోళ్లు కొకల్లలుగా పందెం లో చచ్చిపోతాయి. చచ్చిన కోళ్లకు భలే గిరాకీ ఉంటుంది. ఇక పందెం కోడిపుంజు కొని పందెం వేయాలంటే ఒక్కోచోట లక్షల్లో డిమాండ్ ఉంటుంది. కొన్నిచోట్ల వేలల్లో ఉంటుంది.
ఇప్పడు ఈ సంస్కృతీ ఇక్కడ తెలంగాణలోనూ మొదలైంది. రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో మొయినాబాద్ ఫాం హౌస్ లో కోళ్ల పందేలేస్తూ పోలీసులకు దొరికిపోవడంతో అక్కడ భారిగా నగదు, పందెం కోళ్లు పట్టుబడ్డాయి. దానితో రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి మెట్రోపాలిటన్ కోర్టు లో పందెం కోళ్లను వేలం పాట వేసింది కోర్టు.
అవి కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. 84 పందెం కోళ్లకు కొనసాగుతున్న వేలం పాట కీపెట్టగా, 50 వేల నుండి మొదలైన వేలం పాట. 2.50 లక్షల కు పలకిన 10 పెందం కోళ్ల రేటు.
జోరుగా కొనసాగుతున్న వేలం పాట.
జడ్జ్ సమక్షం లో కొనసాగుతున్న వేలం పాట.
ఈ వేలం పాట లో పాల్గొన్న మొన్న పట్టుబడ్డ పందెం రాయుళ్లు కూడా పాల్గొనడం విశేషం .