Advertisementt

క్రేజీ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే

Mon 17th Feb 2025 03:49 PM
bhagyashri borse  క్రేజీ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే
Bhagyashree Borse Opposite Suriya క్రేజీ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే
Advertisement
Ads by CJ

తమిళ సూపర్ స్టార్ సూర్య తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారా అని అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ క్షణం వచ్చేసింది. వైవిధ్యమైన కథలను ఎంచుకునే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన నటించబోతున్నారు. గతంలో సర్ లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి సూర్యకి ఓ కొత్త తరహా లవ్ స్టోరీ వినిపించగా సూర్య కూడా వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమా మే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సూర్య నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే ఎంపికయ్యే అవకాశం ఉంది. ఆమెనే హీరోయిన్‌గా ఫైనల్ చేయాలా..? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ భాగ్యశ్రీనే నాయికగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ రామ్ వంటి హీరోల సరసన నటించే అవకాశాన్ని పొందింది.

భాగ్యశ్రీ తొలి సినిమా మిస్టర్ బచ్చన్ భారీ ఫ్లాప్ అయినప్పటికీ టాలీవుడ్‌లో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆమె నిరంతరం ప్రయత్నిస్తోంది.

ఇప్పుడు సూర్య సరసన ఛాన్స్ రావడం ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ రామ్ సినిమాల్లో నటిస్తున్న ఆమె ఇప్పుడు సూర్య సినిమాతో తాను మరింత ముందుకెళ్లే అవకాశాన్ని అందిపుచ్చుకుంటోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది.

Bhagyashree Borse Opposite Suriya:

Bhagyashri Borse In Suriya Telugu Film

Tags:   BHAGYASHRI BORSE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ