జనవరి 2 న సైలెంట్ గా పూజా కార్యక్రమాలతో మొదలైన మహేష్-రాజమౌళి SSMB 29 చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత మొదలైపోయింది. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కాదు, ఆమె నెగెటివ్ రోల్ లో SSMB 29 లో కనిపిస్తుంది అంటున్నారు.
అదలా ఉంటే కొద్దిరోజుల క్రితం సోదరుడు సిద్దార్థ్ చోప్రా వివాహ వేడుకల కోసం SSMB 29 చిత్ర షూటింగ్ కు బ్రేకిచ్చిన ప్రియాంక చోప్రా ఆ వివాహ వేడుకల్లో కూతురు, భర్త నిక్ జోనస్ తో కలిసి ఎంజాయ్ చేసింది. పెళ్లి వేడుకలు పూర్తి కావడంతో ప్రియాంక మళ్లీ హైదరాబాద్ వచ్చేసింది. యధావిధిగా ఈరోజు నుంచి SSMB 29 షూటింగ్ కి హాజరవుతుంది.
అయితే SSMB 29 పూర్తిస్థాయి షూటింగ్ ఏప్రిల్ లేదా మే నెల నుంచి కెన్యాలో స్టార్ట్ కాబోతుంది. ఆ దేశంలోని దట్టమైన అడవుల్లో ఈ సినిమా భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు రాజమౌళి.రాజమౌళి-మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతున్న విషయం తెలిసిందే.