లైలా ఈవెంట్ లో నటుడు పృథ్వీ వైసీపీ పై చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ లైలా సినిమాను ఎక్కడ డ్యామేజ్ చేస్తాయో అని హీరో, నిర్మాతలు పృథ్వీ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు అని, సారీ కూడా చెప్పారు. అయినప్పటికి వైసీపీ సోషల్ మీడియా మాత్రం లైలా చిత్రాన్ని బాయ్ కాట్ చేస్తామని హెచ్చరికలు జారి చేసింది. అసలే సినిమాపై అంతంత మాత్రం బజ్ ఉంది, పృథ్వీ క్షమాపణ చెప్పకపోతే డ్యామేజ్ అవుతుంది అని పృథ్వీ తో సారీ చెప్పించారు లైలా హీరో, దర్శకనిర్మాతలు.
సినిమా బావుంటే వైసీపీ మాత్రమే కాదు ఎవ్వరూ సినిమా కలెక్షన్స్ పలేకపోయేవారు. కానీ సినిమా ప్రేక్షకులకు అస్సలు నచ్చకపోవడంతో ప్లాప్ అయ్యింది. అదేదో లైలా పోవడానికి వైసీపీ కారణం, వైసీపీ సోషల్ మీడియాతో పెట్టుకుంటే ఇదే జరుగుతుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది బ్లూ మీడియా.
తాజాగా పృథ్వీ ఇండైరెక్ట్ కామెంట్స్ కే సినిమా వాళ్లకు బుద్ధొచ్చింది. మరి జబర్దస్త్ కమెడియన్స్ ఒళ్ళు దగ్గరపెట్టుకుని మట్లాడండి, ఒకవేళ మీరు కూడా వైసీపీ పై, జగన్ పై ఇష్టమొచ్చిన కామెంట్స్ చేస్తే మీకు ఫ్యూచర్ ఉండదు అని హెచ్చరిస్తుంది. కొంతకాలంగా జబర్దస్త్ కమెడియన్స్ పవన్ పై మక్కువతో జనసేనవైపు ఉంటున్నారు.
వాళ్ళు గనక రెచ్చిపోయి వైసీపీ ని టార్గెట్ చేస్తే ఇకపై వాళ్ళు చేసే సినిమాలు ఆడనివ్వమన్నట్టుగా బ్లూ మీడియా జబర్దస్త్ కమెడియన్స్ ని ఈ విధంగా భయపెడుతుంది.