తెలుగు హీరోయిన్స్ హిట్ కొట్టినా ఆ తర్వాత ఎందుకు పాపులర్ కాలేకపోతున్నారు, అంటే దర్శకనిర్మాతలు తెలుగు హీరోయిన్స్ ని ఎంకరేజ్ చెయ్యకపోవడం వలనా, లేదంటే తెలుగు అమ్మాయిలు గ్లామర్ షో చెయ్యరనా, ఏది ఏమైనా తెలుగు నుంచి హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మాయిలెవరూ టాప్ రేంజ్ కి వెళ్ళలేకపోయారు అనేది జగమెరిగిన సత్యం.
తాజాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ SKN తెలుగు అమ్మాయిలని హీరోయిన్ గా ఎంకరేజ్ చెయ్యకూడదు అంటూ ఓ ఈవెంట్ లో మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రదీప్ రంగరాజన్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తమిళనాట తెరకెక్కిన డ్రాగన్ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిన్న సాయంత్రం జరిగింది.
ఆ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన SKN తెలుగు హీరోయిన్స్ కన్నా, తెలుగు రాని హీరోయిన్స్ నే ఎక్కువగా ఇష్టపడతాం. ఎందుకంటే తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో అని తర్వాత తెలిసింది. ఇక నుంచి తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చెయ్యకూడదు అని నేను మా డైరెక్టర్ సాయి రాజేష్ నిర్ణయించుకున్నాం అంటూ SKN మాట్లాడడం చూసిన వారు ఏ తెలుగు బేబీ SKN ను అంత హర్ట్ చేసింది, అసలు SKN మాట్లాడింది బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించేనా..
బేబీ తర్వాత ఆఫర్ ఇస్తే వైష్ణవి చైతన్య రిజెక్ట్ చేసిందా, లేదంటే మారేదన్నా విషయం జరిగి SKN ఇంత హర్ట్ అయ్యాడా అంటూ గుసగుసలాడకుంటున్నారు.