Advertisementt

భారీ టార్గెట్ తో సలార్ 2

Sun 16th Feb 2025 09:38 PM
salaar 2  భారీ టార్గెట్ తో సలార్ 2
Salaar 2 with a huge target భారీ టార్గెట్ తో సలార్ 2
Advertisement
Ads by CJ

నిన్నగాక మొన్న పుష్ప ద రూల్ 2000 కోట్ల భారీ టార్గెట్ తో దర్శకులకు, స్టార్ హీరోలకు సవాల్ విసిరింది. డిసెంబర్ లో విడుదలై పుష్ప 2 ఫైనల్ రన్ లో 2000 కోట్ల మార్క్ కు దగ్గరైంది. దానితో పాన్ ఇండియా డైరెక్టర్స్ దగ్గర నుంచి బాలీవుడ్ డైరెక్టర్స్ వరకు అందరి కన్ను ఆ 2000 కోట్ల టార్గెట్ పైనే ఉంది. సో ఇకపై  సినిమాలన్నీ ఆ రేంజ్ లోనే చెయ్యాలని, ఆ రేంజ్ కథలతోనే ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. 

అందుకే సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తియ్యబోయే మూవీ మొదలు సలార్ 2 వరకు అదే టార్గెట్ పెట్టుకుంటున్నారట. ప్రభాస్ తో చేసిన సలార్ 1 700 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అదే విషయాన్ని ప్రశాంత్ నీల్ కూడా చెప్పారు. సలార్1 అనుకున్న అంచనాలను రీచ్ కాలేదు అని. అందుకే ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ 2 విషయంలో తగ్గేదెలా అంటున్నారు. 

బడ్జెట్ పరంగానే కాదు కలెక్షన్స్ పరంగాను సలార్ 2 2000 కోట్ల టార్గెట్ తో తెరకెక్కించాలనే ప్లాన్ చేసుకుంటున్నారట. సలార్ పార్ట్ 1 లో జరిగిన మిస్టేక్స్ పార్ట్ 2 లో జరక్కుండా చూసుకోవాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. అయితే ప్రశాంత్ నీల్-ప్రభాస్ ఎప్పుడు సలార్ 2 ని స్టార్ట్ చేస్తారో అనేది క్లారిటీ రావడం లేదు. కారణం ప్రభాస్ వరసగా రెండు సినిమాలను ఫినిష్ చెసే పనిలో ఉండగా.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. సో సలార్ 2 ఎప్పుడు స్టార్ట్ అవ్వుద్దో అని ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

Salaar 2 with a huge target:

Salaar 2 update

Tags:   SALAAR 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ