కొన్నాళ్ళుగా కిస్సిక్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ పై వార్తలోస్తున్నాయి తప్ప ఆ విషయం కన్ ఫర్మ్ మాత్రం అవ్వలేదు. అదిగో ఆ హీరోతో శ్రీలీల హిందీ ఎంట్రీ ఉంటుంది, ఇదిగో ఈ హీరోతో బాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అంటూ ప్రచారం జరగడమే కానీ.. అధికారికంగా ఫిక్స్ అవ్వలేదు. తాజాగా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ అధికారం అయ్యింది.
కార్తీక్ ఆర్యన్ హీరోగా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమవడమే కాదు అధికారికంగా అనౌన్సమెంట్ వచ్చింది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్-శ్రీలీల జంటగా సినిమాని కాంబో ని అనౌన్స్ చేస్తూ టీజర్ వదిలారు. నువ్వు నాదానివి, నువ్వే నా ప్రతి ఆనందానివి అంటూ టీజర్ వదిలారు.
ఈ టీజర్ చూస్తుంటే కార్తీక్ ఆర్య సింగర్ గా ఆయనకు లవర్ గా శ్రీలీల కనిపిస్తుంది.