Advertisementt

100 కోట్ల క్లబ్బులోకి నాగ చైతన్య

Sun 16th Feb 2025 03:16 PM
thandel  100 కోట్ల క్లబ్బులోకి నాగ చైతన్య
Naga Chaitanya enters the 100 crore club 100 కోట్ల క్లబ్బులోకి నాగ చైతన్య
Advertisement
Ads by CJ

ఫైనల్లీ అక్కినేని హీరో 100 కోట్ల క్లబ్బు లోకి అడుగుపెట్టాడు. అక్కినేని ఫ్యామిలిలో మొదట 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టిన హీరోగా నాగ చైతన్య రికార్డ్ క్రియేట్ చేసాడు. తండేల్ చిత్రంతో సెకండ్ వీకండ్ పూర్తి కాకుండానే నాగ చైతన్య 100 కోట్లు గ్రాస్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. 

ఫిబ్రవరి 7 న పాన్ ఇండియా మూవీ గా విడుదలైన తండేల్ చిత్రం తెలుగు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. హిట్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కు రీచ్ అయిన తండేల్ చిత్రం పాన్ ఇండియా ఆడియన్స్ కు ఎక్కలేదు. నార్త్ లో ఇరగదీస్తోంది అనుకుంటే.. నార్త్ ఆడియన్స్ ను తండేల్ డిజప్పాయింట్ చెయ్యడంతో అక్కడ కలెక్షన్స్ మరీ వీక్ గా ఉన్నాయి. 

ఇక రెండో వారం అంటే వాలంటైన్స్ డే కి విడుదలైన తెలుగు చిత్రాలేవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో నాగ చైతన్య తండేల్ కు కలిసొచ్చింది. దానితో సెకండ్ వీకెండ్ పూర్తి కాకుండానే తండేల్ అఫీషియల్ గా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టింది. దానితో అక్కినేని ఫ్యామిలిలో మొదటి 100కోట్ల హీరోగా నాగ చైతన్య నిలిచాడు. 

Naga Chaitanya enters the 100 crore club:

Thandel Worldwide Box Office Collection

Tags:   THANDEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ