అల్లు అర్జున్ కన్ఫ్యూజ్ అవుతున్నాడా, 2000 కోట్ల బ్లాక్ బస్టర్ పుష్ప2 తర్వాత ఎలాంటి జోనర్లో సినిమా చెయ్యాలి, ఎలాంటి కథ అయితే పాన్ ఇండియా ఆడియన్స్ కు రీచ్ అవుతుంది, ఎంత క్రేజీ కథ అయితే పుష్ప 2ని డామినేట్ చేస్తుంది, ముందుగా త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలా, లేదంటే కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ తో సినిమా మొదలు పెట్టాలా ఇలా అల్లు అర్జున్ ఆలోచిస్తున్నాడా.
ఈ విషయాల్లో క్లారిటీ రావడం లేదా, లేదంటే అల్లు అర్జున్ కొత్త సినిమాని తన బర్త్ డే అంటే ఏప్రిల్ 8 వరకు అనౌన్స్ చెయ్యకుండా, అప్పడు ఏ డైరెక్టర్ తో తన తదుపరి మూవీ ఉంటుందో అనేది అనౌన్స్ చేసి అల్లు ఫ్యాన్స్ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాడా ఇదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
కానీ కొంతమంది మాత్రం అల్లు అర్జున్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. పుష్ప 2 తో వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవాలంటే అంతకుమించిన కథ కావాలి, అది త్రివిక్రమ్, అట్లీ వారిలో ఎవరో ఒకరు ఇవ్వాల్సిందే. అయితే అందులో ముందుగా ఏ డైరెక్టర్ తో ముందుకెళ్ళాలి, లేదంటే ఒకేసారి ఇద్దరితో సినిమా మొదలు పెట్టాలా అని అల్లు అర్జున్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడంటూ మాట్లాడుకుంటున్నారు. చూద్దాం అల్లు అర్జున్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది.