సక్సెస్ ఫుల్ కమెడియన్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించి ప్రేక్షకుల నుంచి శెభాష్ అనిపించుకుని గిన్నెస్ బుక్ రికార్డ్ లో తన పేరు పదిలం చేసుకున్న బ్రహ్మానందం కొన్నేళ్లుగా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. పేరుకు కమెడియన్ అయినా రంగమార్తాండ లాంటి చిత్రాల్లో సీరియస్ పాత్రల్లో బ్రహ్మి యాక్టింగ్ వేరే లెవల్.
సినిమాల్లో తన డ్రీం రోల్స్ ఫుల్ ఫీల్ అయినా ఆయనకు తీరని కోరిక ఒకటి ఉంది. అదే తన పెద్ద కొడుకు గౌతమ్ ను నటుడిగా నిలబెట్టాలని. గతంలో గౌతమ్ హీరోగా సినిమాలు చేసినా అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. దానితో నటనకు బిగ్ బ్రేక్ ఇచ్చిన గౌతమ్ తండ్రి బ్రహ్మి తో కలిసి బ్రహ్మ ఆనందం మూవీ చేసారు.
ఎప్పుడు షూటింగ్ జరుపుకుందో, ఎప్పుడు ఫినిష్ అయ్యిందో తెలియదు కానీ ఓ 15 రోజుల ముందు నుంచి బ్రహ్మ ఆనందం ప్రమోషన్స్ తో హడావిడి చేసేసి ప్రేక్షకుల ముందు వచ్చేసారు. మెగాస్టార్, ప్రభాస్ లాంటి స్టార్స్ అండతో థియేటర్స్ లోకి వచ్చిన బ్రహ్మ ఆనందం మూవీకి ప్రేక్షకులు, క్రిటిక్స్ ఇద్దరూ డిజప్పాయింట్ రివ్యూస్ ఇచ్చారు.
గౌతమ్ నటన, బ్రహ్మి-వెన్నెల కిషోర్ కామెడీ వర్కౌట్ అయినా నెమ్మదిగా సాగే కథ, కథనం, బలమైన ఎమోషన్స్ లేకపోవడంతో బ్రహ్మ ఆనందం సో సో రిజల్ట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఈ చిత్ర రిజల్ట్ చూసాక బ్రహ్మి తనకు కొడుకు కోసం చేసిన ప్రయత్నం వృధా అయ్యింది అనే చెప్పాలి.