జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా థియేటర్స్ లో విడుదలైన నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబో చిత్రం డాకు మహారాజ్ కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. బ్లాక్ బస్టర్ కాకపోయినా డాకు మహారాజ్ ప్రతి ఏరియా లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. అదే విషయాన్ని మేకర్స్ పోస్టర్ వేసి ప్రకటించారు. అయితే సంక్రాంతికి విడుదలైన చిత్రాలు ఓటీటీ కి వస్తోన్న వేళ డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ పై సస్పెన్స్ నడిపించారు మేకర్స్.
గత వరం నుంచి డాకు మహారాజ్ తో పాటుగా విడుదలైన గేమ్ చేంజర్ ఓటీటీ లో సందడి చేస్తుంది. మరోపక్క డాకు మహారాజ్ కన్నా రెండు రోజుల తర్వాత విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బుల్లితెర పైకి రావడానికి రెడీ అయిన వేళ డాకు మహారాజ్ ఓటీటీ డేట్ పై రోజుకో న్యూస్ అభిమానులను కన్ఫ్యూజ్ చేసింది. ఫ్యాన్సీ డీల్ తో డాకు మహారాజ్ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.
డాకు మహారాజ్ ఓటీటీ సస్పెన్స్ కు తెరదించుతూ తాజాగా నెట్ ఫ్లిక్స్ డాకు మహారాజ్ ఓటీటీ డేట్ ని ప్రకటించింది. ఫిబ్రవరి 21 నుంచి డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా అనౌన్స్ చేసి సస్పెన్స్ కు తెర దించారు. దానితో నందమూరి అభిమానులు రిలాక్స్ అవుతూ డాకు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.