ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు శనివారం సాయంత్రం థమన్ మ్యూజికల్ నైట్ గ్రాండ్ గా మొదలయ్యింది. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. సీఎం చద్రబాబు అయినా, మరెవరైనా ఈ ఈవెంట్ కు టికెట్ కొనుక్కునే రావాలని ఖరాఖండిగా చెప్పిన విషయం అందరికి తెలుసు.
నందమూరి ఫ్యామిలీతో పాటుగా నారా ఫ్యామిలీ, ఇంకా ఎన్టీఆర్, బాలయ్య అభిమానులు, మ్యూజిక్ లవర్స్ అందరూ థమన్ మ్యూజికల్ నైట్ లో సందడి చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి సీఎం చంద్రబాబు తో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఎంట్రీ ఇవ్వడమే కాదు హిందూపూర్ ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ తో కలిసి ముగ్గురు ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు.
పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా తన కొడుకు అకీరా తో కలిసి, కేరళ, తమిళనాడు లో పలు దేవాలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. కాషాయ వస్త్రాల్లోనే పవన్ కళ్యాణ్ థమన్ ఈవెంట్ లో కనిపించారు. చంద్రబాబు-పవన్ నడుమ గ్యాప్ అనే ప్రచారం జరుగుతున్న వేళ బాబు-పవన్ ఒకే చోట ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇవ్వగా గాసిప్ రాయుళ్లకు షాక్ తగిలింది.