మెగాస్టార్ చిరంజీవి ఈమధ్యన యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. యంగ్ లుక్స్ ఫోటో షూట్స్ తో మెగాస్టార్ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. మెగాస్టార్ యంగ్ హ్యాండ్ సమ్ లుక్స్ చూసి కుర్ర హీరోలైతే కుళ్ళుకుంటున్నారు. వసిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరు చేస్తున్న విశ్వంభర చిత్రం లో ఆయన లుక్ ఓ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి వింటేజ్ చిరూని చూపించాయి.
తాజాగా విశ్వంభర ఇంట్రో సాంగ్ కి సంబందించిన షూట్ కోసం మాసివ్ సెట్ వేసి అందులో మెగాస్టార్ చిరు పై ఇంట్రడక్షన్ సాంగ్ ని తెరకెక్కించబోతున్నట్టుగా మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ లో చిరంజీవి లుక్ చూస్తే నిజంగా ఏమున్నాడురా కత్తిలా అంటారేమో, కాదు కాదు మెగా అభిమానులు అదే అంటున్నారు.
కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని రఫ్ గా కనిపించిన చిరు యంగ్ లుక్స్ మాత్రం అభిమానులకు పండగే. జీప్ లో నుంచి దిగుతూ చిరు కొత్తగా కనిపించడం పట్ల మెగా ఫ్యాన్స్ మాత్రమ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విశ్వంభర రిలీజ్ డేట్ ని అతి త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.