కాలం కలిసొస్తే అడ్డేది ఉండదు, ఆపేది ఉండదు అనే వ్యాఖ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది ప్రస్తుతం రష్మిక పయనం. ఆమె చేస్తోన్న ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతూ నిత్యం తనని చాట్ బస్టర్స్ లో నిలుపుతుంది. మొన్న యానిమల్, నిన్న పుష్ప 2, నేడు చావా బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాలిడ్ హిట్స్ కొట్టడంతో పాటు ఆయా సినిమాల్లో అంతటి స్ట్రెంత్ ఉన్న కేరెక్టర్స్ ను ప్లే చెయ్యడం రష్మిక కు నిజంగా డెస్టినీ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి.
సౌత్ లో బ్లాక్ బస్టర్ హీరోయిన్ రేంజ్ కి చేరిన రష్మిక మెల్లగా హిందీలో జెండా పాతేసింది. హిందీ లోకి అడుగుపెట్టడమే స్టార్ హీరోలతో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ వరసగా సక్సెస్ అందుకుంటుంది. యానిమల్ తోనే కాదు, పుష్ప 2 తోనూ పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక ఆ వెంటనే చావా తో సూపర్ హిట్ కొట్టేసింది.
నిన్న వాలెంటైన్స్ డే రోజున ఆడియన్స్ ముందుకు వచ్చిన చావా కు బ్లాక్ బస్టర్ రివ్యూస్ రావడమే కాదు, విక్కీ కౌశల్, రష్మిక నటనకు ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు. దానితో రష్మిక పాపులారిటీ హిందీలో మరింతగా పెరిగింది. ప్రస్తుతం సల్మాన్ తో సికిందర్, ధనుష్ తో కుబేర చిత్రాల్లో నటిస్తున్న రశ్మికకు ఇకపై మరిన్ని బాలీవుడ్ క్రేజీ ఆఫర్స్ రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.