దాసరి తర్వాత ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అన్న ప్రశ్న ఉద్భవించింది. ఆ పెద్దరికాన్ని మెగాస్టార్ కంటిన్యూ చేస్తున్నారు. ఆయన నాకు పెద్దరికం అంటగట్టొద్దు అని స్మూత్ గా చెప్పినా అందరూ చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నారు. చిన్న హీరోలు, యంగ్ హీరోలు, దర్శకనిర్మాతలు ఇలా అందరూ చిరుని ఇండస్ట్రీ పెద్దగా గౌరవిస్తూ తమ సినిమాలను ప్రోత్సహించమని అడుగుతున్నారు.
మెగాస్టార్ కూడా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమాల ట్రైలర్స్, పోస్టర్స్, టీజర్ లాంచ్ చెయ్యడం, సినిమాలను వీక్షించి సోషల్ మీడియా వేదికగా అందులో నటించిన నటులను, ఇంకా టెక్నీకల్ సిబ్బందిని, దర్శకనిర్మాతలను అప్రిషేట్ చేస్తున్నారు. అది ఆ చిన్న నటులకు, దర్శకులు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ప్రేక్షకులు కూడా చిరు అభినందించారంటే అందులో విషయముంది అని నమ్ముతారు.
ఇప్పుడు మెగాస్టార్ అలా ప్రోత్సహించడమే తప్పైపోయింది. రీసెంట్ గా ఆయన విశ్వక్ సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటుగా, బ్రహ్మానందం సినిమా బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి గెస్ట్ గా వచ్చారు. అక్కడ గెస్ట్ గా వచ్చి సినిమాని ప్రమోట్ చేసినందుకు కాదు అసలు ఏడుపు చిరు ఫ్లో లో మాట్లాడిన మాటలు కొంతమందికి రుచించలేదు.
లైలా ఈవెంట్ లో తన నిర్మాత కాబట్టి ఏదో ప్రజారాజ్యం, జనసేన అంటూ మాట్లాడిన చిరు, బ్రహ్మ ఆనందం ఈవెంట్ లో వారసుడు పై క్యాజువల్ గా చేసిన కామెంట్స్ పై విమర్శలు ఎక్కుపెట్టారు సదరు చిరు యాంటీ మీడియా వాళ్ళు. అందులోను లైలా, బ్రహ్మ ఆనందం సినిమాలు డిజప్పాయింట్ చెయ్యడంతో మెగాస్టార్ ఇలాంటి సినిమాలను ప్రమోట్ చెయ్యడం అవసరమా.. అంటూ మాట్లాడుతున్నారు.
మరి చిరు ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటారు, కానీ ఓ వర్గం మీడియా మిత్రులు మాత్రం చిరు హెల్ప్ చెయ్యడానికి కాదు ఆయన మాట్లాడిన మాటలకు హర్ట్ అయ్యి విమర్శిస్తున్నారు. అసలు వారికి మెగాస్టార్ ని విమర్శించే అర్హత ఉందా అనేది మెగా అభిమానుల ప్రశ్న.