గేమ్ చేంజర్ చిత్రం అనేది ఏ విధంగాను మెప్పించలేని సినిమాగా మెగా ఫ్యాన్స్ ను బాగా డిజప్పాయింట్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ శంకర్ తో సినిమా చేస్తున్నారు అంటే చాలామంది ఎగ్జైట్ అయ్యారు. కానీ ఇండియా 2 తర్వాత గేమ్ చేంజర్ పై అనుమానాలు మొదలయ్యాయి. గేమ్ చెంజర్ విడుదలకు ముందు ఎలాంటి బజ్ లేకుండా విడుదలయ్యింది.
థియేటర్స్ లో గేమ్ చెంజర్ ఆడియన్స్ ను బాగా డిజప్పాయింట్ చేసింది. రామ్ చరణ్ లుక్స్ బావున్నా కథ ను మరీ రొటీన్ గా ప్రెజెంట్ చెయ్యడమే కాదు, శంకర్ మార్క్ డైరెక్షన్ కనిపించకకపోవడం, సిల్లీ స్క్రీన్ ప్లే, కామెడీ యాక్షన్, గ్లామర్ చూపించే హీరోయిన్ తప్ప గేమ్ చేంజర్ లో సూపర్ అనిపించే సన్నివేశాలు కనిపించలేదు.
అదే విషయాన్ని పరచూరి గోపాల కృష్ణ చెబుతున్నారు. ఓ కలెక్టర్ అయిన వ్యక్తి సహనం కోల్పోవడం, ప్రేమించిన అమ్మాయి చెప్పింది అని కోపాన్ని పక్కనపెట్టడం అభిమానుకు నచ్చలేదు, బలమైన ఎమోషన్స్ లేకపోవడం, తండ్రిని చంపాడు అని తెలిసినా సైలెంట్ గా ఉండడం, తల్లిని సిల్లీగా చంపుకోవడం, చివరి నిమిషంలో సీఎం అవడం ఇదంతా ప్రేక్షకులకు బోర్ కొట్టించేశాయి. ఒకే ఒక్కడు చిత్రాన్నిఅటు తిప్పి గేమ్ చేంజర్ చేసారు తప్ప అందులో కొత్తగా చూపించిందేమి లేదు.
శ్రీకాంత్ కి బలమైన కథ చెప్పి చరణ్ విషయానికొచ్చేసరి.. ఎలివేషన్ తప్ప ఆయన చుట్టూ కనిపించిన కథ వీక్ అవడమే గేమ్ చేంజర్ కి మెయిన్ మైనస్. శంకర్ పూర్తిగా అవుట్ డేటెడ్ డైరెక్టర్ అయ్యాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చెయ్యడం చూసి గేమ్ చేంజర్ లోపాలు ఇంత ఓపెన్ గాన్ అని మెగా ఫ్యాన్స్ కాస్త ఫీలవుతున్నారు.