తెలుగులో రెండు మూడు హిట్స్ పడడంతో కృతి శెట్టి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంటుంది అనుకుంటే.. ఆతర్వాత అమ్మడు కు హిట్ అనే పదమే దూరమైపోయింది. వరస వైఫల్యాలు కృతి శెట్టి కెరీర్ ని డౌన్ చేసేశాయి. తెలుగు, తమిళ, మలయాళం అంటూ వరస సినిమాలు చేస్తుంది.
కానీ సక్సెస్ అనే పదానికి కాస్త దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం తరుచు కాకపోయినా అప్పుడప్పుడు ట్రెండీ లుక్స్ తో అవకాశాల కోసం వల వేస్తుంది. ఒకప్పుడు సంప్రాయానికి రాఫ్ అనుకునే కృతి శెట్టి ఇప్పుడు ట్రెండీ గా గ్లామర్ లుక్ లోకి చేంజ్ అయ్యింది.
తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి శెట్టి వైట్ డ్రెస్ అది కూడా చిట్టి పొట్టి డ్రెస్సుతో ఫోటోలకు ఫోజులిచ్చింది. కృతి శెట్టి కొత్త లుక్ చూస్తే నిజంగా మతిపోవాల్సిందే. ఆ రేంజ్ లో అమ్మడు అందాల ఆరబోత ఉంది. వైట్ డ్రెస్ లో కృతి శెట్టి ఎల్లో కలర్ పూల బొకేతో అద్దరగొట్టేసింది.