కేథరిన్ థ్రెసా అంటే తెలుగులో తెలియని వారుండరు. మరీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కనిపించకపోయినా అల్లు అర్జున్, రానా లాంటి క్రేజీ హీరోలతో జోడి కట్టింది. కానీ కేథరిన్ థ్రెసా కు టాలీవుడ్ లో బ్రేకిచ్చే సినిమా ఒక్కటి కూడా తగల్లేదు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో నెగెటివ్ రోల్ కట్టి శెభాష్ అనిపించుకున్నా ఆతర్వాత ఆమెకి అదృష్టం కలిసి రాలేదు.
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లోనూ అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా వెళుతున్న కేథరిన్ థ్రెసా ఎపుడు గ్లామర్ గా ట్రెండ్ కి తగినట్టుగా మారిపోతుంది. కానీ అదృష్టమే అమ్మడు కు ఆమడ దూరాన నిలుస్తుంది. సోషల్ మీడియాలో తరచూ కాకపోయినా అప్పుడపుడు గ్లామర్ ఫొటోస్ వదులుతుంది.
తాజాగా కేథరిన్ థ్రెసా వదిలిన గ్లామర్ పిక్స్ చూసి ఈ అందాన్ని కాస్త పట్టించుకోండి అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. బ్లాక్ టాప్ వేసి, ట్రెండీ అవుట్ ఫిట్ లో కేథరిన్ థ్రెసా లుక్ నిజంగా బ్యూటిఫుల్ గా కనిపించింది. అందాల ఆరబోతలో కేథరిన్ థ్రెసా అసలు తగ్గదు అని మరోసారి రుజువు చేసింది.