నేషనల్ క్రష్ రష్మిక ఒక్కోసారి కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతుంది. గతంలో తనకి లైఫ్ నిచ్చిన కన్నడ సూపర్ హిట్ ఫిలిం కిర్రాక్ పార్టీ విషయంలో ఆమె మాట్లాడిన మాటలు రష్మిక ను కన్నడ ప్రేక్షకులు ట్రోల్ చెయ్యడమే కాదు, ఆ సినిమా దర్శకుడు రిషబ్ శెట్టి రష్మిక పై పదే పదే ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసాడు. ఇప్పుడు మరోసారి రష్మిక కన్నడ ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది.
సౌత్ లో సక్సెస్ అయ్యాక బాలీవుడ్ బాట పట్టిన రష్మిక కు అక్కడ హిందీ వాళ్ళు రెడ్ కార్పెట్ పరిచారు. దానితో రష్మిక హుషారుగా తన మాతృ భాష కన్నడ అనే విషయాన్నే మరిచిపోయేంతగా ఆనందంలో మునిగితేలుతోంది. ఆమె రీసెంట్ గా నటించిన చావా చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక తను హైదరాబాద్ నుంచి వచ్చానని, ఇక్కడ బాలీవుడ్ లో ఇంత మందిని చూశాక మీ కుటుంబంలో భాగమైనందుకు చాలా హ్యాపీ గా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
మరి రష్మిక వచ్చింది కన్నడ నుంచి. కానీ ఆమె హైదరాబాద్ తన సొంతూరు అన్నట్టుగా మాట్లాడడం పై కన్నడ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. వరసగా సక్సెస్ లు వచ్చే సరికి తన వూరు, పేరు మర్చిపోయింది, ఇది మంచి పద్దతి కాదు అంటూ రష్మిక ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. మరి ఈ విషయంలో రష్మిక స్పందన ఎలా ఉండబోతుందో జస్ట్ వెయిట్ అండ్ సి.