వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇప్పడు ఫుల్ హ్యాపీ, కారణం విశ్వక్ సేన్ నటించిన లైలా చిత్రం పై వైసీపీ సోషల్ మీడియా చూపించిన నెగిటివిటి అంతా ఇంతా కాదు. నటుడు పృథ్వీ లైలా ఈవెంట్ లో వైసీపీ పై ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ వైసీపీ ని బాగా హర్ట్ చేసాయి. దానితో లైలా చిత్రాన్ని బాయ్ కాట్ చెయ్యాలంటూ వైసీపీ సోషల్ మీడియా నానా రచ్చ చేసింది.
పృథ్వీ సారీ చెప్పాడు, అయినప్పటికీ సినిమాపై వైసీపీ కి ద్వేషం తగ్గలేదు. ఇక సినిమా విడుదలకు ముందు ఈ సోషల్ మీడియా రచ్చ లైలా చిత్రానికి భారీ ఓపెనింగ్స్ తెస్తాయని మేకర్స్ ఇంకా హీరో విశ్వక్ సేన్ కూడా భావించే ఉంటారు. అసలు బజ్ లేని ఈ చిత్రానికి వైసీపీ హడావిడి ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది అనుకున్నారు.
ఆ హెల్ప్ ఏమో కానీ. ఈరోజు విడుదలైన లైలా చిత్రానికి ఆడియన్స్ నుండి ఇటు క్రిటిక్స్ నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది. లైలా గా అమ్మాయి గెటప్ కి విశ్వక్ సేన్ సరిపోయినా, అక్కడక్కడా కామెడీ సన్నివేశాలు బావున్నా, కథ, కథనం బోర్ కొట్టించడం, ఇంకా వల్గర్ డైలాగ్స్ ఆడియన్స్ సహనాన్ని పరీక్షించడంతో లైలా ఎవ్వరికి నచ్చలేదు.
కష్టపడి లేడీ గెటప్ వేస్తె సరిపోతుందా.. దానికి తగ్గ కంటెంట్ ఉండొద్దా అంటూ విశ్వక్ సేన్ ని నెటిజెన్స్ ఏకి పడేస్తున్నారు. లైలా కి వస్తున్న ఫీడ్ బ్యాక్ చూసి వైసీపీ సోషల్ మీడియా వింగ్ లోలోపల సంబరపడిపోతుంది. అందులో పృథ్వీ నటించాడు, సినిమాపై విశ్వక్ సేన్ పై కోపం లేకపోయినా పృథ్వీ నటించిన సినిమా డిజాస్టర్ అవడం వాళ్ళను సంతోషపెట్టింది.