గత ఏడాది నుంచి మంచు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్ మధ్యన జరిగిన గొడవలు ఇప్పటికి అంటే ఈ ఏడాదిలోనూ కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా మోహన్ బాబు పై మంచు విష్ణు నటిస్తూ, నిర్మిస్తున్న కన్నప్ప పై మనోజ్ చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. మనోజ్ ఓ టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొన్నాడు.
ఆ వేదికపై MBU విద్యా సంస్థల్లో బౌన్సర్ల అరాచకాలు ఎక్కువయ్యాయి, తాగేసి బౌన్సర్లు గోల చేస్తున్నారు. మోహన్ బాబు బౌన్సర్లు ధ్వంసం చేసిన F5 రెస్టారెంట్‌ను మంచు మనోజ్ పరిశీలించాడు. కోట్లు వెచ్చించి, లోన్లు తీసుకుని హాస్టళ్లు, హోటళ్లు పెట్టుకుని బతుకుతున్న వారిపై ఇలాంటి దాడి చెయ్యడం కరెక్ట్ కాదు.
ఇది ఆస్తి గొడవలు కాదు, ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ చేస్తున్న పోరాటం, మోహన్ బాబు సిబ్బందిలో కీలక పాత్ర పోషించే హేమాద్రి నాయుడు, ఫోట్రాగ్రఫర్ మౌళి.. తరచుగా అక్కడి ప్రాంతంలోని బిజినెస్ జరుపుకుంటున్న వారిని కొట్టి, వారి నుండి డబ్బులు వసూళు చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశాడు మంచు మనోజ్.
అంతేకాదు కోట్లు పెట్టి సినిమా చేస్తే అది పెద్ద సినిమా అయిపోదు, చెట్టుని చూపించి కాయలమ్ముకునే రకం తను కాదు, నన్ను తొక్కేయాలని చాలామంది చూస్తున్నారు. అది ఎవ్వరి వల్లా కాదు, నన్ను తొక్కలన్నా, లేపాలన్నా ప్రేక్షకులే చూసుకుంటారు అంటూ మంచు విష్ణు కన్నప్పపై మనోజ్ ఇండైరెక్ట్ కామెంట్స్ చేసాడు.