సీత రామం వచ్చి చాలా ఏళ్ళైనా మృణాల్ ఠాకూర్ ను ఇంకా సీతా రామం బ్యూటిగానే పిల్లిస్తున్నారు. అంతలా సీత పాత్ర అందరి మనస్సుల్లో పాతుకుపోయింది. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు చేసినా ఆమెను మాత్రం సీత రామం బ్యూటీనే అంటూ సంబోధిస్తున్నారు. ఇక సౌత్ సినిమాలకు కాస్త బ్రేకిచ్చి హిందీలో బిజీ అయ్యింది మృణాల్.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్ తో గ్లామర్ షో చేసే మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ డెకాయిట్ లో నటిస్తుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన పిక్స్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే. వైట్ కలర్‌లో రంగుల డిజైన్ ఉన్న లాంగ్ గౌన్‌లో చాలా క్యూట్ గా స్వీట్ గా కనిపించింది.
సింపుల్ గానే ఉన్న బ్యాక్‌లెస్ డ్రెస్‌లో మృణాల్ క్యూట్ అండ్ క్లాసీ లుక్ లో మేకప్ లేకుండా అందంగా కనిపించింది. ఇక హిందీలో క్రేజీ ప్రాజెక్ట్స్ అయిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాతో పాటు మరో మూడు హిందీ సినిమాల్లో మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.