Advertisementt

ప్రేమంటేనే భయం వేస్తుంది-ఐశ్వర్య రాజేష్

Fri 14th Feb 2025 11:08 AM
aishwarya rajesh  ప్రేమంటేనే భయం వేస్తుంది-ఐశ్వర్య రాజేష్
Love is fear Aishwarya Rajesh ప్రేమంటేనే భయం వేస్తుంది-ఐశ్వర్య రాజేష్
Advertisement
Ads by CJ

సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేష్ కి భార్యగా అమాయకురాలు పాత్రలో అద్దరగొట్టేసిన ఐశ్వర్య రాజేష్.. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకు టాలీవుడ్ లో వరస అవకాశాలు తలుపు తడతాయని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఐశ్వర్య రాజేష్ కి ఎలాంటి తెలుగు అవకాశాలు రాలేదు. తెలుగు సినిమాలు చెయ్యాలంటే ఇష్టం, రాజమౌళి, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉంది అంటూ ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

అంతేకాదు అదే ఇంటర్వ్యూలో ప్రేమ,పెళ్లి పై ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను చాలా ఎమోషనల్ అంటూ చెప్పిన ఐశ్వర్య గతంలో రిలేషన్ షిప్ లో నరకం అనుభవించాను, అందుకే మరోసారి ప్రేమంటే భయం వేస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను వేధింపులకు గురి చేసాడు. అతడితో బ్రేకప్ చేసుకుని వేదనకు గురయ్యాను. 

మరోసారి అలాంటి నరకంలోనే కాలు పెట్టాను, నేను ఎంతగానో ఇష్టపడిన ఆ వ్యక్తి నన్ను కొట్టడానికి కూడా చెయ్యెత్తాడు, నేను ఎంతగానో ప్రేమిస్తే ఇలా అవుతుందేమిటా అని బాధపడ్డాను, రెండు రిలేషన్స్ లోను నరకం అనుభవించాను, అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఏడాదికి పైగానే పడుతుంది. అందుకే మరోసారి ప్రేమ అంటేనే భయమేస్తుంది. 

కానీ నాకు పెళ్లిపై నమ్మకం ఉంది, పిల్లలకు తల్లవ్వాలని ఉంది. అందుకే నేను నా ఎగ్స్ ను జాగ్రత్త చేశాను అంటూ ఐశ్వర్య రాజేష్ ప్రేమ, పెళ్లి పై కామెంట్స్ చేసింది. 

Love is fear Aishwarya Rajesh:

Aishwarya Rajesh Reveals Facing Harassment in Love

Tags:   AISHWARYA RAJESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ