గత నాలుగు రోజులుగా నటుడు పృథ్వీ కారణంగా లైలా మూవీకి కష్టాలు మొదలయ్యాయి. వైసీపీ సోషల్ మీడియా లైలా టీమ్ ని, లైలా సినిమా ను టార్గెట్ చేసారు. 150 గొర్రెలు, 11 గొర్రెలు అన్నది వైసీపీ పార్టీ గురించే అని పృథ్వీ పై ఫైర్ అయ్యారు. దానితో విశ్వక్ సేన్ సారీ చెప్పినా కూల్ అవ్వలేదు. ఈలోపు నటుడు పృథ్వీ హై బిపితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు.
అంతేకాదు తానేమి వైసీపీ ని అనలేదు, గుమ్మడికాయల దొంగలెవరంటే భుజాలు తడుముకుంటారంటూ అమ్మనా భూతులు మాట్లాడాడు.
దానితో వైసీ సోషల్ మీడియా మరింతగా రెచ్చిపోయింది. బాయ్ కాట్ లైలా హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ పృథ్విని టార్గెట్ చేసారు. దానితో ఫ్యామిలీని వైసీపీ సోషల్ మీడియా వేధిస్తుంది అంటూ పృథ్వీ ఆసుపత్రి నుంచి నేరుగా సైబర్ క్రైమ్ కి వెళ్లి కంప్లైంట్ చేసాడు. అయినప్పటికీ బాయ్ కాట్ లైలా అంటూ లైలా ను ఆడనివ్వమని వైసీపీ కార్యకర్తలు శపథం చెయ్యడంతో పృథ్వీ దిగొచ్చి సారీ చెప్పాడు.
ఓ వీడియో వదులుతూ.. వ్యక్తిగతంగా నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు, నా వల్ల సినిమా దెబ్బతిన కూడదు అందరికీ క్షమాపణలు చెపుతున్నాను , బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అని అనండి, ఫలక్ నామాదాస్ కంటే లైలా పెద్ద హిట్ కావాలి అంటూ వైసీపీ పార్టీకి సారీ చెబుతూ పృథ్వీ వీడియో షేర్ చేసాడు.