గత ఏడాది సినీ హీరో రాజ్ తరుణ్ పై అతని మాజీ ప్రియులు లావణ్య చేసిన ఆరోపణలు, రాజ్ తరుణ్ మరో హీరోయిన్ తో కలిసి ఉంటున్నాడంటూ చేసిన వ్యాఖ్యలు, ముంబై లోని హోటల్ లో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో కలిసి ఉండడం, మాల్వి మల్హోత్రా తనని బెదిరించింది అంటూ లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం, ఈ టాపిక్ లోకి మస్తాన్ సాయి అనే అతను ఎంటర్ అవడం అన్ని అందరికి తెలిసిన విషయమే.
ఈ కేసులో మస్తాన్ సాయి రీసెంట్ గా అరెస్ట్ య్యాడు. లావణ్య వీడియోస్ ని సోషల్ మీడియాలో పెడతా అంటూ బెదిరింపులకు పాల్పడిన కేసులోను, అలాగే మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకున్న కేసులోనూ అతన్ని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసారు. తాజాగా లావణ్య ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పశ్చాత్తాపపడుతున్నట్లుగా, రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెబుతా అంటూ కన్నీళ్లు పెట్టుకుని చెప్పడం మరింత హాట్ టాపిక్ గా మారింది.
నా లైఫ్ ని కోల్పోయాను, నా మనిషిని కోల్పోయాను, నేను రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెబుతాను, నేను ఏ వీడియోస్ ని విడుదల చెయ్యలేదు, మస్తాన్ సాయి వల్లే నేను డ్రగ్స్ తీసుకున్నాను, ప్రతి క్షణం ప్రాణ భయంతో బ్రతుకుతున్నాను, పదుల సంఖ్యలో అమ్మాయిల వీడియో రికార్డ్స్ మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి. ఎంతోమంది అమ్మాయిలతో మస్తాన్ సాయి చలగాటమాడాడు.
నాలా మరే అమ్మాయి సఫర్ అవ్వకూడదనే పోరాటం చేస్తున్నాను, సొసైటీలో నాకు సపోర్ట్ ఉండదు అని తెలిసి కూడా పోరాడుతున్నాను, ప్రాణ భయంతో రోడ్డు మీదకి వచ్చాను, నాకేం జరిగినా మస్తాన్ సాయి పేరెంట్స్ దే బాధ్యత, నన్ను ఎప్పుడైనా చంపెయ్యోచ్చు అంటూ లావణ్య సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.