దీపికా పదుకొనె గత ఏడాది పాపకు జన్మనిచ్చింది. డెలివరీ వరకు చాలా యాక్టీవ్ గా తిరిగిన దీపికా పదుకొనె బేబీ పుట్టాక హెల్త్ పరంగా సిక్ అయ్యింది. పాపకు జన్మనిచ్చిన దీపికా మొదటిసారి ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసింది. అప్పుడు దీపికా బరువు పెరిగి లావుగా కనిపించడంతో ఆమె అభిమానులు షాకయ్యారు.
రణ్వీర్ సింగ్-దీపికా లు బేబీ పుట్టాక పాప తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. తాజాగా దీపికా పదుకొనె ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తల్లయ్యాక దీపికా చేయించుకున్న ఫస్ట్ ఫోటో షూట్ అది. అంతేకాదు ఆమె ఓ షో లోమెరిసింది. కాస్త బరువుగానే ఉన్నా దీపికా గ్లామర్ విషయంలో ఎలాంటి లోటు లేదు అనిపించేలా ఆ ఫోటో షూట్ ఉంది.
బ్లాక్ అవుట్ ఫిట్ లో దీపికా పదుకొనె టైట్ గా జడ వేసుకుని మెడలో ట్రెండీ పూసల గొలుసుతో లేటెస్ట్ ఫోటో షూట్ సూపర్బ్ అనేలా ఉంది. అయితే దీపికా పదుకొనె కాస్త వెయిట్ పెరిగినా ఆమె హైట్ దానిని కవర్ చేసేసింది.