ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం కాదు ఆ రేంజ్ ప్రోజెక్ట్ కోసం వెయిట్ చేసిన నిధి అగర్వాల్ ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేస్తుంది. తాజాగా నిధి అగర్వాల్ కెరీర్ లో గ్యాప్ రావడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నేను స్టార్ కిడ్ ని కాదు, నా ఫ్యామిలీకి సినిమా నేపద్యము లేదు.
నేను నటిగా ముందు వరసలో ఉండడమే పెద్ద విశేషం. నాకు సినిమా అవకాశాలు రావడమే పెద్ద విజయం సాధించిన ఫీలింగ్ వస్తుంది. కెరీర్లో ఎక్కువ సినిమాలు చెయ్యాలని ఎవరికుండదు. నేను మాత్రం బలమైన కంటెంట్ ఉన్న కథలనే నమ్ముతాను. అలాంటి వాటిపైనే ఫోకస్ పెడతాను. నేనేమి హీరోను కాదు, నెంబర్ ఆఫ్ కమర్షియల్ సినిమాలు చెయ్యడానికి.
ఒకవేళ అలాంటి కమర్షియల్ సినిమాలు చేసినా అలాంటి స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకున్నందుకు విమర్శలు చేస్తారు. అందుకే కథాబలమైన సినిమాలను ఎంచుకుంటున్నాను అంటూ నిధి అగర్వాల్ కెరీర్ లో గత రెండేళ్లుగా గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పుకొచ్చింది.