ప్రస్తుతం సౌత్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. హిందీ ప్రాజెక్ట్స్ లో బిజీ అయిన సమంత అక్కడ ముంబైలో ఉంటుంది సిటాడెల్ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ పూర్తి చేసిన సమంత అదే రాజ్ అండ్ డీకే బ్యానర్ లో మరో సీరీస్ లోనటిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనే కాదు ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉండే సమంత ఎక్కువగా గుడులు తిరుగుతుంది.
వెకేషన్స్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో.. ఆధ్యాత్మికతకు సమంత అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. సద్గురు ఆశ్రమానికి వెళ్లి తరచూ అక్కడ మెడిటేషన్ లో పాల్గొంటుంది. అంతేకాదు తిరుమల మెట్ల మార్గం ద్వారా సమంత శ్రీవారి దర్శనానికి వెళుతుంది.
తాజాగా సమంత పెద్ద బొట్టుతో పద్దతిగా దర్శనమిచ్చింది. చుడిదార్ లో సమంత దైవ భక్తితో నుదుటున పెద్ద బొట్టుతో కనిపించడంతో ఆమె అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు. ఎప్పుడు గ్లామర్ కు దగ్గరగా ఉండే సమంత చాల అరుదుగా ఇలా కనిపిస్తుంది.