మాస్ హీరో అవ్వాలంటే మొహానికి మసి పూసుకొవాల్సిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరోలకు మసి పూసి మాస్ హీరో గా ప్రెజెంట్ చేసి సక్సెస్ సాధించడంతో చాలామంది హీరోలు మాస్ అవతార్ లో కనిపించాలనే థాట్ లోకి వెళ్లిపోతున్నారు. కెజిఎఫ్, సలార్ చూసాక ఎన్టీఆర్ దేవర చిత్రంలో అలానే మాస్ గా ట్రై చేసాడు. ఇప్పుడు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ కూడా అలాంటి బ్యాక్డ్రాప్ లోనే తెరకెక్కుతుంది.
అసలు కింగ్ గా మారాలంటే ఎంతమంది ప్రజలు చావాలి, ఎంతమంది విలన్స్ ఉంటే రాజు అవుతాడు. అదేనా మాస్ అంటే. మాస్ అంటే తమ కోసం ఓ ఊరు ఊరు చచ్చిపోతేనే రాజవుతాడా.. ఇప్పడు ఇదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి కారణం విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న కింగ్ డమ్ టీజర్ చూసాక అందరూ మాట్లాడుకుంటున్న మాట.
బాడి లాంగ్వేజ్, మాస్ లుక్స్ ఇలా వేరియేషన్స్ లో విజయ్ దేవరకొండ లుక్ కి వంక పెట్టడానికి లేదు. కానీ కింగ్ గా విజయ్ దేవరకొండ మారాలంటే ఓ ఊరు ఊరంతా స్మశానం అవ్వాలా, రక్తం ఏరులై పారలా, శవాల గుట్టలు ఉండాలా, అదేనా మాస్ అంటే. మాస్ హీరోగా మారాలంటే ఇంత చెయ్యాలా అనేది అర్ధం కానీ ప్రశ్నగానే కనిపిస్తుంది. అది హీరోలకు ఎప్పుడు అర్ధమవుతుందో మరి.