Advertisementt

పేదల పార్టీ - రైతుల పార్టీ - టీడీపీ పార్టీ

Thu 13th Feb 2025 01:23 PM
tgp  పేదల పార్టీ - రైతుల పార్టీ - టీడీపీ పార్టీ
TDP govt పేదల పార్టీ - రైతుల పార్టీ - టీడీపీ పార్టీ
Advertisement
Ads by CJ

వైసీపీ ప్రభుత్వంలో సన్న చిన్నకారు రైతులు అటు ఎరువుల కొరత ఇటు కరెంట్ కష్టాలతో నానా ఇబ్బందులు పడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ రంగంలోనైనా ఇబ్బంది పడని వారు లేరు. అందులోను వ్యవసాయ రంగంలో రైతులు వైసీపీ ప్రభుత్వం వలన, నేతల వల్ల వేధింపులకు గురైన రైతులు నానా ఇబ్బందులు అనుభవించారు. 

రాయలసీమలోని అనంతపురం సింగనమల నియోజకవర్గంలో ఓ రైతుని వైసీపీ ప్రభుత్వం ఎంతగా వేధిచింది, ఎన్ని ఇబ్బదులు పెట్టిందో అనేది ఆ రైతు మాటల్లోనే.. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలం వెంకటాపల్లి గ్రామానికి చెందిన రైతు కొరకుటి శ్రీనివాసులు తన తోట కోసం పొలంలో ఎన్నిసార్లు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో.. చివరిగా తన ఇంటి దగ్గర వేసిన బోరు లో నీరు పడడంతో కరెంట్ కనెక్షన్ కోసం వైసీపీ ప్రభుత్వంలో అధికారులకు అర్జీ పెట్టుకుంటే.. కక్ష కట్టిన కొంతమంది అధికారులనపై ఒత్తిడి పెట్టి ఆ రైతుకి కరెంట్ ఇవ్వకపోవడంతో ఆ రైతు ఆత్మహత్య చేసుకునేవరకు వెళ్ళింది. దానితో ఆ రైతు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వద్దకు వెళ్ళాడు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో జరిగిన గ్రీవెన్స్ లో తన సమస్యను చెప్పుకున్నాడు.

వెంటనే రైతు సమస్యపై స్పందించిన మంత్రి స్వయంగా జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసారు. అప్పటి వరకు ఈ వ్యవహారంపై స్పందించని స్థానిక అధికార యంత్రాంగం వెంటనే పరుగులు తీసింది. విద్యుత్ లైన్ ను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసారు. ఇక తన పంటకు నీరు రావడంతో ఆనందంతో పొంగిపోయిన ఆ రైతు.. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, అచ్చేన్నాయుడు ఫోటోలను తన పొలంలో ఏర్పాటు చేసాడు. పూజలు చేసి అనంతరం బోరు ఆన్ చేసి ఆ ఫోటోలను తీసి.. టీడీపీ కార్యకర్తలకు పంపారు. ఆ రైతు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ఫోటోలను తన బోరు దగ్గర పెట్టుకుని మరీ స్విస్ ఆన్ చేసిన ఘటన హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు టీడీపీ ప్రభుత్వానికి ఆయన రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అయ్యా నమస్కారం. 

    నేను ఒక రైతుని. నాది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పాల మండలం వెంకట్రాంపల్లి గ్రామం. నేను 11 ఎకరాల్లో దానిమ్మ తోట వేశాను. నీళ్ల కోసం 48 బోర్లు  వేస్తే చుక్క నీరు పడలేదు... చివరగా నా ఇంటి ముందు బోరు వేస్తే పుష్కలంగా నీళ్లు పడ్డాయి. నా ఆనందానికి అవధులు లేవు. విద్యుత్ కనెక్షన్ కొరకు అధికారులకు మొరపెట్టుకున్నాను. కానీ నేను ఒకటి తెలిస్తే కాలం మరోలా తలిసినట్టు నా పైన కక్ష కట్టి కొంతమంది ఓర్వలేక నాకు కరెంటు లైన్ రానివ్వకుండా అధికారులపై ఒత్తిడి పెట్టి తొమ్మిది నెలలుగా వేధించారు. పొలం ఎండిపోతోంది పుష్కలంగా నీళ్లు పడ్డాయి ఏమి చేయలేని నిస్సహాయతతో నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ సమయంలో ఆ నోట ఈ నోట చేరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కొంతమంది నా సమస్యపై స్పందించారు. మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుంది మీరు వెంటనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక జరుగుతుంది. అక్కడికి వెళ్లి మీ సమస్యను తెలియపరచండి. నారా లోకేష్ గా దృష్టికి వెళుతుంది. వెంటనే అధికారులతో మాట్లాడతారు మీ సమస్యపై స్పందిస్తారు. మీ సమస్య తీరుతుందనీ నాకు ధైర్యం చెప్పారు. నేను వెంటనే విజయవాడ కేంద్ర కార్యాలయానికి బయలుదేరాను. అప్పటికే నాకు ధైర్యం చెప్పిన కొంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అక్కడి నాయకులతో మాట్లాడి నా సమస్యను వారి దృష్టిలో పెట్టారు. అక్కడ గళ్ళగానే నా సమస్యపై స్పందించిన మంత్రిగారు కొండపల్లి శ్రీనివాస్ మరియు గండి బాబ్జి గార్లు నా సమస్య వినగానే నాకు ధైర్యం చెప్పి వెంటనే మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి ఫోన్లు చేసి ఈ రైతు సమస్య పైన వెంటనే మీరు ఎం తీసుకోవాలని కలెక్టర్ గారికి, పలువురు అధికారులకు ఆదేశించారు. నాకు కొంత ధైర్యం వచ్చింది. కానీ ఎక్కడో కొంత బాధ. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇక ఇంటికి వెళ్లడం కన్నా ఇటు నుంచే వెళ్లిపోవాలని నేను నా కుటుంబం అనుకున్నాం. కానీ నా వెనకాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి నిమిషానికి ధైర్యం చెబుతూ నాలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. సరే అని తిన్నగా ఇంటికి వెళ్లాను. మర్నాడు కలెక్టర్ గారి దగ్గరకు వెళ్లాను. కింద అధికారులకు ఆదేశాలు ఇచ్చాను మీ సమస్య తీరుతుంది ధైర్యంగా ఉండండి అని చెప్పారు. సరిగ్గా నాలుగు రోజులకి పోలీస్ అధికారులతో రెవెన్యూ అధికారులు ఎలక్ట్రికల్ అధికారులు అందరూ వచ్చారు వెంటనే నా మోటార్ బోర్ కనెక్షన్ కి విద్యుత్ లైన్ లాగడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చింది బతుకు మీద ఆశ కలిగింది. నా పొలానికి ఊపిరి వచ్చింది నా పైరుకి పచ్చదనం వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు నేను నా కుటుంబం ఎంతో సంతోషించాం... నన్ను నా కుటుంబాన్ని నా పంటనే కాపాడిన నా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారికి లోకేష్ గారికి, నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారికి కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే బాబ్జి గారికి మా కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే గారికి అధికారులకు అందరికీ పాదాభివందనం చేసుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....🙏🙏

ఒక రైతు సమస్య తెలియగానే ఇంత స్పీడుగా స్పందించి రైతు కన్నీళ్లు తుడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే నా 60 ఏళ్ల వయసులో ఒక తెలుగుదేశం పార్టీని మాత్రమే చూశాను. ఇది పేదల పార్టీ రైతుల పార్టీ శ్రామికుల పార్టీ కర్షకుల పార్టీ..... నా పార్టీ కి నా నాయకులకి మా కార్యకర్తలకి ఆజన్మాంతం రుణపడి ఉంటాం నేను నా కుటుంబం...🙏🙏

తమ విధేయుడు 

కొరకోటి శ్రీనివాసులు 

9989601499

అనంతపురం సింగనమల నియోజకవర్గం, నార్పాల మండలం 

వెంకట్రాంపల్లి గ్రామం....

TDP govt:

TDP

Tags:   TGP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ