సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం కాదు.. ప్రమోషన్స్ లో కావాలని వివాదాలు చేస్తున్నారా అనిపించేలా ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి. కనిపించడం కాదు ప్రస్తుతం అదే జరుగుతుంది. సినిమాలపై ప్రేక్షకుల్లో ఆ వివాదాలు ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి.
రీసెంట్ టైమ్స్ లో లైలా చిత్రంలో జరిగిన కాంట్రవర్సీ అందరికి తెలిసిందే. వరస వైఫల్యాలతో ఉన్న విశ్వక్ సేన్ సినిమాని ఎవరు పట్టించుకుంటారు అనుకునే లోపు.. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్, మెగాస్టార్ ప్రజారాజ్యం, జనసేన పై చేసిన కామెంట్స్ సినిమాని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేసింది.
దానితో లైలా చిత్రానికి ఎక్కడలేని పాపులారిటీ వచ్చి పడింది. బాయ్ కాట్ లైలా, సపోర్ట్ లైలా హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను లైఫ్ లో రాజకీయాల జోలికి వెళ్ళను అని ప్రకటించారు. మెగాస్టార్ అలా ప్రకటించడానికి అది సమయము కాదు సందర్భము కాదు అనేది నెటిజెన్స్ వాదన.
అంతేకాదు మెగాస్టార్ చిరు రామ్ చరణ్ కొడుకు అంటూ వారసుడిపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. గతంలో శ్రీకాంత్ అయ్యంగార్ కూడా క్రిటిక్స్ పై నోటికొచ్చినట్టుగా మాట్లాడి హైలెట్ అయ్యాడు. అవేమి సినిమాకి హెల్ప్ కాలేదు. మరి లైలా చిత్రానికి ఈ ప్రమోషనల్ కాంట్రవర్సీ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.