మంచు వారి ఆస్తి వివాదంలో మోహన్ బాబుకు మంచు మనోజ్ కు మద్యన తలెత్తిన తగాదా మీడియా మీదకి మళ్లింది. మంచు వారి వ్యవహారం రోడ్డున పడడంతో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంతో మోహన్ బాబు సహనం కోల్పోయి ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై చేయి చేసుకోవడంతో అతను ఆసుపత్రి పాలయ్యాడు.
దానితో మోహన్ బాబు పై కేసు నమోదు అయ్యింది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం అప్లై చెయ్యగా హై కోర్టు దానిని తిరస్కరించింది. మరోపక్క మోహన్ బాబు రిపోర్టర్ కి వైద్య ఖర్చులను చెల్లించడంతో పాటుగా ఆయన క్షమాపణ కూడా చెప్పారు. అంతేకాదు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ కోసం సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో మోహన్ బాబుకి భారీ ఊరట లభించింది. జర్నలిస్టు పై దాడికేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్ట్. దానితో మోహన్ బాబు కు ఈ కేసులో బిగ్ రిలీఫ్ దొరికింది.