వైసీపీ కి అండగా వైసీపీ సోషల్ మీడియా పని చేస్తుంది అన్నదానిలో ఎలాంటి సందేహం లేదా.. 2024 ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియా విషయంలో జగన్ నమ్మిన వ్యక్తి మోసం చేసినా ప్రస్తుతం అతన్ని తప్పించి కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించాక వైసీపీ సోషల్ మీడియా వింగ్ బలపడిందా, అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.
జగన్ ని ఏమైనా అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీస్ పై పడిపోయి నోరు పారేసుకున్న వైసీపీ సోషల్ మీడియా వాళ్ళలో పలువురిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ లు చేసి జైల్లో పెట్టింది. అయితే రీసెంట్ గా లైలా ఈవెంట్ లో మెగాస్టార్ చిరు జనసేన, పృథ్వీ వైసీపీ పై చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ పై వైసీపీ సోషల్ మీడియా భగ్గుమంది. బాయ్ కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చెయ్యడమే కాదు, చిరుని కూడా వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేసింది.
ఇక నటుడు పృథ్వీ వలన సినిమాకు డ్యామేజ్ అవుతుంది అని విశ్వక్ సేన్ సారి చెప్పాడు, కానీ పృథ్వీ ఇంకా సారీ చెప్పకపోవడంపై పృథ్విని వైసీపీ సోషల్ మీడియా వెంటాడుతుంది. దానితో పృథ్వీ సైబర్ క్రైం లో తనని తన ఫ్యామిలీని వైసీపీ సోషల్ మీడియా మానసికంగా ఇబ్బంది పెడుతుంది, వేధిస్తుంది అంటూ కంప్లైంట్ చేసాడు.
మరోపక్క మెగాస్టార్ చిరు లైలా ఈవెంట్ లో మాట్లాడిన మాటలకు బ్రహ్మానందం ఈవెంట్ లో క్లారిటీ ఇవ్వడమే కాదు లైఫ్ లో రాజకీయాల జోలికి వెళ్ళను అని ప్రకటించారు. వైసీపీ సోషల్ మీడియాను తట్టుకోలేక చిరు ఇలాంటి వివరణ ఇచ్చారా, ఇది చూస్తే వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ అని ఒప్పుకోవాలమే అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.