ఎట్టకేలకు గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్యెల్యే వల్లభనేని వంశీ ని ఈరోజు ఉదయం హైదరాబాద్ రాయదుర్గంలో పటమట పోలీసులు అరెస్ట్ చేసారు. గతంలో టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముద్దాయిగా ఉన్న వంశీ కూటమి ప్రభత్వం వచ్చిన ఈ తొమ్మిది నెలలుగా కనిపించకుండా అమెరికా వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఆ కేసులో బెయిల్ రావడంతో తిరిగి గన్నవరంలో అడుగుపెట్టిన వంశీని తాజాగా..
సత్యనారాయణ అనే కంప్యూటర్ ఆపరేటర్ ని కిడ్నప్ చేసి బెదిరించారనే ఆరోపణలతో వంశీని అరెస్ట్ చేసారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ వంశీపై ఫిర్యాదు చెయ్యడంతో వంశీని పోలీసులు అరెస్ట్ చేసారు.
టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో తనని బెదిరించి తన చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని సత్యవర్దన్ ఫిర్యాదు చెయ్యడంతో వల్లభనేని వంశీపై కిడ్నప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు నోటీస్ ఇచ్చి మరీ పడమట పోలీసులు హైదరాబాద్ లో ఉన్న వంశీని అరెస్ట్ చేసి విజయవాడ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు.