హీరోయిన్ రష్మిక మందన్న తనతో కలిసి పనిచేసిన ప్రముఖ హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ నెల 14న విడుదల కాబోతున్న ఛావా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది.
తాజా సినిమాల్లో విక్కీ కౌశల్ అల్లు అర్జున్ రణ్‌బీర్ కపూర్‌లతో కలిసి పని చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పింది. ప్రతి ఒక్కరు మంచి వ్యక్తిత్వం కలిగిన వారు అని సహజంగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారని వివరించింది. షూటింగ్ సమయంలో ఎవరికీ అసౌకర్యం కలగకుండా స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పే విధంగా వారు వ్యవహరించారని పేర్కొంది.
అల్లు అర్జున్‌తో నటించడం గురించి మాట్లాడుతూ ఆయన ఎనర్జీకి తాను పూర్తిగా మ్యాచ్ అవుతానని ఇద్దరి మధ్య సహజమైన కెమిస్ట్రీ ఉన్నట్లు అనిపించిందని చెప్పింది. ఆయనతో స్క్రీన్‌పై కలిసి పనిచేయడం చాలా కంఫర్ట్‌గా అనిపించిందని చెప్పింది.
రణ్‌బీర్ కపూర్ గురించి చెప్పిన రష్మిక తమ ఇద్దరికీ నాన్సెన్స్ అనే విషయం అస్సలు ఇష్టముండదని షూటింగ్ సమయంలో కేవలం సినిమాల గురించే మాట్లాడతామని ప్రొఫెషనల్‌గా వ్యవహరించడమే తమ లక్ష్యమని చెప్పింది.
విక్కీ కౌశల్ విషయంలో అతను అసాధారణమైన వ్యక్తి అని రష్మిక ప్రశంసించింది. ఆయన వంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని తన కెరీర్‌లో ఆయనతో పని చేసిన అనుభవం మరిచిపోలేని ఒక గొప్ప జ్ఞాపకమని పేర్కొంది. వీరంతా తనకు మంచి సహోద్యోగులే కాకుండా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారన్న విషయాన్ని వెల్లడించింది.