కొద్దిరోజులుగా ఫీవర్ తో సఫర్ అవుతున్న పవన్ కళ్యాణ్ అటు ఏపీ క్యాబినెట్ సమావేశాలకు కూడా హాజరవ్వలేదు. నడుం నొప్పితో బాధపడుతూ రాజకీయాల్లో యాక్టీవ్ గా లేని పవన్ ఉన్నట్టుండి ఇలా ఆలయాల సందర్శనానికి శ్రీకారం చుట్టడంపై చాలామందిలో చాలా రకాల అనుమానాలు మొదలయ్యాయి.
ఏపీ క్యాబినెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్ బీజేపీ ఆదేశాల మేరకు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లడంపై విమర్శలు మొదలయ్యాయి. దీనిని బట్టి చంద్రబాబు కు పవన్ దూరమవుతున్నారా, లేదంటే ఇది పక్కా పవన్ వ్యూహమా, కాదంటే నడుం నొప్పి అంటూ చంద్రబాబు మీటింగ్ కు వెళ్ళని పవన్ ఇలా అనేది బ్లూ మీడియా పట్టి పట్టి చూస్తుంది. పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాలు ధరించడంతో.. పవన్ లోని నటుడు కదిలాడు-గెట్ అప్ వేసాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం తన స్నేహితుడు ఆనంద్ సాయి, కొడుకు అకీరా తో కలిసి పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అటునుంచి అటే కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాకి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.