తన ఇద్దరు కుమార్తెలకు ఇద్దరు ఇద్దరు అమ్మాయిలే కావడంతో రామ్ చరణ్ కి అయినా కొడుకు పుడతాడు, మనవడిని ఎత్తుకోవచ్చు అని ముచ్చట పడిన మెగాస్టార్ కు రామ్ చరణ్-ఉపాసన కూడా చిరుకి మానవరాల్ని ఇచ్చారు. తన ఇంటికి సాక్షాత్తు మహాలక్షి వచ్చింది అని సంబరపడిన చిరు ఇప్పుడు రామ్ చరణ్ నుంచి వారసుడిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాదు కాదు ఓపెన్ గానే అడుగుతున్నారు.
తాజాగా చిరు బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మట్లాడుతూ.. ఇంట్లో మొత్తం అమ్మాయిలే ఉండటంతో లేడీస్ హాస్టల్‌లో వార్డెన్‌లా ఉంటుంది. చుట్టూ అమ్మాయిలే ఉంటారు, ఒక్క మగ పిల్లాడు కూడా లేడు. అందుకే ఈసారి అయినా మగ పిల్లాడిని కనరా చరణ్, మన లెగస్సీ కంటిన్యూ అవ్వాలి అంటూ ఉంటాను.
నా మనవరాలు క్లింకార అంటే చరణ్‌కి ముద్దు, మళ్లీ చరణ్ ఇంకో అమ్మాయిని కంటాడేమో అని భయంగా అంది అంటూ సరదాగా చిరంజీవి మెగా వారసుడు విషయంలో తన కోరికను బయటపెట్టారు.