మలైకా అరోరా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని వదిలి విడాకులు తీసుకున్న తర్వాత చాలా ఏళ్ళు కుర్ర హీరో అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని డేటింగ్ చేసింది. దానితో అర్జున్ కపూర్-మలైకా కపూర్ లు వివాహం కూడా చేసుకుంటారనే ప్రచారం జరిగింది. వెకేషన్స్, పార్టీలు, రెస్టరెంట్ లు అంటూ పబ్లిక్ గానే తిరిగారు.
బాలీవుడ్ సెలెబ్రిటీస్ ఫంక్షన్స్ కు కూడా కలిసే అటెండ్ అయ్యేవారు. కానీ ఈమధ్యన ఇద్దరికి బ్రేకప్ అయ్యింది. మలైకా అరోరా-అర్జున్ కపూర్ లు ఈ విషయమై అఫీషియల్ గా చెప్పకపోయినా విడిపోయారనేది మాత్రం సత్యం. ఈ రూమర్స్ నేపథ్యంలో మలైకా ఫాదర్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో అర్జున్ కపూర్ మలైకా అరోరా వెంటే ఉండడంతో వారి బ్రేకప్ రూమర్స్ అనుకున్నారు.
కానీ మలైకా-అర్జున్ కపూర్ లు విడిపోయారు. కొన్నాళ్లుగా ఇద్దరూ విడివిడిగానే కనబడుతున్నారు. అర్జున్ కపూర్ రీసెంట్ గా సింగిల్ అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. తాజాగా మలైకా అరోరా సింగిల్ గాఉన్న పిక్ షేర్ చేసింది. ఉయ్యాలలో కూర్చుని ఆలోచనలో మునిగిపోయిన పిక్ లో మలైకా జిమ్ డ్రెస్ లో కనిపించగా.. ఆమె పెంపుడు డాగ్ ఆమె ముందే కూర్చుని ఉంది. ఆ పిక్ చూసాక ఒంటరి గా కనిపిస్తున్న మలైకా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.