సంక్రాంతికి వస్తున్నాం చిత్రం చూసిన వారు కానీ, సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారు కానీ బుల్లిరాజా కామెడీని ఇప్పుడప్పుడే మర్చిపోలేరు. కొరికేత్తాను నిన్ను కోరికెత్తాను అంటూ వెంకటేష్ తో కలిసి గోదావరి లాంగ్వేజ్ లో బుల్లిరాజు చేసిన కామెడీకి, నాన్నోయ్ నీ కోసం ఒకటి తెచ్చాను, నీ కోసం పిన్నిని తెచ్చాను అంటూ చేసిన కామెడీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి హైలెట్స్.
బుడ్డోడి గోదావరి యాసకు పడిపోని ప్రేక్షకుడు లేదు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో బుల్లిరాజు సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యాడు. దానితో లైలా యూనిట్ బుల్లిరాజు పాపులారిటీని తెగ వాడేశారు. మరోరెండు రోజుల్లో విడుదల కాబోతున్న లైలా ని బుల్లిరాజు ప్రమోట్ చేస్తున్నాడు.
మా నాన్నకు పిన్ని కావాలి, ఎలాగైనా లైలానట్టుకొచ్చి రెండో పిన్నిని చెయ్యాలి.. అంటూ లైలా గెటప్ వేసిన విశ్వక్ సేన్ దగ్గరకు వెళ్ళి మా నాన్నా కోసం పిన్ని కావలి లైలా ఎక్కడ అని అడిగిన బుల్లిరాజాను విశ్వక్ సేన్ అదోలా చూస్తూ వస్తే ఏం చేస్తావ్ అంటూ అడగగా.. దానికి బుల్లిరాజూ కొరికేత్తాను నిన్ను కొరికేత్తాను అనగానే విశ్వక్ సేన్ బులిరాజును కొరికిన వీడియో వైరల్ అయ్యింది.