జబర్దస్త్ లో ఛాన్స్ వచ్చాక ఇప్పటివరకు జబర్దస్త్ ని వదలకుండా ఉన్న అతికొద్దిమందిలో యాంకర్ రష్మీ కూడా ఒకరు. అనసూయ తర్వాత జబర్దస్త్ లోకి చేరిన రష్మీ.. ఎవరు జబర్దస్త్ ని వదిలేసినా.. ఎథిక్స్ కి కట్టుబడి ఆమె ఇంకా జబర్దస్త్ కి యాంకర్ గానే కొనసాగుతుంది. మల్లెమాల యాజమాన్యం పై ఉన్న గౌరవమే తనని ఇక్కడ ఉండేలా చేసింది అని రష్మీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తూ.. జబర్దస్త్, అలాగే అదే ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీకి రష్మీ నే యాంకరింగ్ చేస్తుంది. అప్పుడప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ లో మెరిసే రష్మీ తాజాగా ఆసుపత్రి పాలైంది. ఆమె ఆసుపత్రి బెడ్ పై ఉన్న పిక్ ని షేర్ చేస్తూ భుజం నొప్పి నుంచి విముక్తి పొందేందుకు సిద్దమయ్యాను అంటూ పోస్ట్ పెట్టింది.
భుజం నొప్పితో డాన్స్ చేయడాన్ని మిస్ అవుతున్నాను, మళ్లీ ఎప్పటిలా మీముందుకు రావడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. రష్మీ భుజం నొప్పి కారణముగా సర్జరీ చేయించుకుంటున్నట్టుగా తెలుస్తుంది.