యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలిసి సెట్స్ మీదకి ఎప్పుడు వెళతారో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూడని రోజు లేదు. జనవరిలోనే ఎన్టీఆర్-నీల్ కాంబో రెగ్యులర్ షూట్ మొదలవుతుంది అన్నా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో ఉన్నారా, లేదంటే అనేది కూడా వారికి క్లారిటీ రావడం లేదు.
ఈరోజు ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ VD 12 టీజర్ ని తెలుగులో లాంచ్ చెయ్యబోతున్నారు. గత ఏడాది దేవర తో బిగ్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ అంతకుముందే ప్రశాంత్ నీల్ తో మూవీ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఎన్టీఆర్-నీల్ రెగ్యులర్ షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది తాజాగా ఎన్టీఆర్-నీల్ మూవీ రెగ్యులర్ షూట్ ముహూర్తం సెట్ అయ్యింది అంటున్నారు.
ఈనెల 17 అంటే ఫిబ్రవరి 17 నుంచి ఎన్టీఆర్-నీల్ మూవీ కర్ణాటక నుంచి మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. ఎన్టీఆర్-నీల్ మూవీ అప్ డేట్ ని మేకర్స్ సిద్ధం చేస్తున్నారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా కన్నడ గర్ల్ రుక్మిణి వసంత్ పేరు వినబడుతోంది.