టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ తో పాగా వేసిన మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. 2025 ఏడాది మొదట్లో దుబాయ్ కి వెళ్లి ఎంజాయ్ చేసొచ్చిన మీనాక్షి చౌదరి మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం వియజోత్సవ వేడుకలో మెరిసింది. ఈ చిత్రం తర్వాత మీనాక్షి చౌదరికి మరో క్రేజీ టాలీవుడ్ ప్రోజెక్ట్ ఉంది.
అది నవీన్ పోలిశెట్టి తో అనగనగా ఒక రాజు చిత్రంలో మీనాక్షి చౌదరి నటిస్తుంది. శ్రీలీల ఈ చిత్రం నుంచి తప్పుకోగా.. ఆ ప్లేస్ లోకి లక్కీగా మీనాక్షి చౌదరి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్ ని షేర్ చేసే మీనాక్షి చౌదరి తాజాగా షేర్ చేసిన లుక్ చూస్తే మతిపోవాల్సిందే.
ఆరెంజ్ కలర్ అవుట్ ఫిట్ లో మీనాక్షి మత్తెక్కించే చూపులతో మతిపోగోట్టే భంగిమలో కనిపించడంతో యూత్ ఆమె పిక్ కి లైక్ లు కొడుతూ, షేర్లు చేస్తూ హంగామా చేస్తున్నారు.